తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కడుపులో కొకైన్​.. ఆమె అండర్​వేర్​లో గోల్డ్​.. సబ్బు పెట్టెల్లో డ్రగ్స్​!'​

Stomach Smuggling: కేజీ కొకైన్​ను కడుపులో మింగి అక్రమ రవాణా చేస్తున్న మహిళను దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారు అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.14 కోట్ల విలువైన డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు వేర్వేరు ఘటనల్లో లోదుస్తుల్లో బంగారం, సబ్బు పెట్టెల్లో డ్రగ్స్​ స్మగ్లింగ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు.

drugs seized
డ్రగ్స్​

By

Published : Dec 29, 2021, 4:47 PM IST

Stomach Smuggling: వీడొక్కడే సినిమా చూశారా? అయితే.. డ్రగ్స్​ స్మగ్లింగ్ గురించి అర్థమయ్యే ఉంటుంది! డ్రగ్స్ సరఫరాలో భాగంగా హీరో ఫ్రెండ్ ఓ సారి డ్రగ్స్​ను కడుపులోకి మింగి అక్రమ రవాణాకు పాల్పడతాడు.. గుర్తొచ్చిందా? సరిగ్గా అలాంటి ఘటనే దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.

మహిళ కడుపులో ఉన్న కొకైన్​

ఉగాండా నుంచి వస్తున్న ఓ మహిళ ఎయిర్ పోర్ట్​లో ఆయాసపడుతూ నడుస్తోంది. ఇది గమనించిన అధికారులు ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆమె నిరాకరించింది.​ అనుమానంతో కస్టమ్స్ అధికారులు ఆమెను చెక్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఒక కేజీ బరువున్న 91 కొకైన్​ క్యాప్సుల్స్​ను ఆమె కడుపులో గుర్తించారు. వాటి విలువ రూ.14 కోట్లు ఉంటుందని చెప్పారు. డ్రగ్స్​ను స్వాధీనం చేసుకుని.. ఆ మహిళను అరెస్టు చేశారు.

సాధారణంగా ఈ విధమైన డ్రగ్స్ రవాణా చేసేవారు 400-500 గ్రాముల వరకు కడుపులో తీసుకొస్తారు. కానీ ఈ మహిళ ఏకంగా కేజీ కొకైన్​ను ప్రమాదకర స్థాయిలో అక్రమ రవాణాకు పాల్పడిందని అధికారులు తెలిపారు.

సోప్ బాక్సుల్లో డ్రగ్స్​..

Hiding Drugs In Soap: సోప్ బాక్సుల్లో అక్రమంగా డ్రగ్స్​ను రవాణా చేస్తున్న ముగ్గురు నైజీరియన్లను బెంగళూరు అధికారులు అరెస్టు చేశారు. రూ. 80 కోట్ల విలువైన కొకైన్​, హాష్ ఆయిల్​ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా నుంచి వ్యాపార వీసా మీద భారత్​కు వచ్చి డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు. డ్రగ్స్​ను ముంబయి నుంచి బెంగళూరుకు తరలిస్తున్నారని పేర్కొన్నారు.

సోప్ బాక్సుల్లో డ్రగ్స్ రవాణా

మహిళ లోదుస్తుల్లో బంగారం అక్రమ రవాణా..

Gold Smuggling By Hiding Under Garments: లోదుస్తుల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ మహిళను జైపుర్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి 700 గ్రాముల బరువున్న బంగారాన్ని నిందితురాలు లోదుస్తుల్లో పెట్టి అక్రమంగా తీసుకొస్తున్నారని తెలిపారు. దీని విలువ రూ.35 లక్షలు ఉంటుందని వెల్లడించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. మహిళను అరెస్టు చేసినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:కాన్పుర్​లో మరో 'జీఎస్​టీ' మోసం.. పక్కా ప్లాన్​తో ఒకేసారి సోదాలు!

మహిళను కారులో తీసుకెళ్లి గ్యాంగ్​రేప్​- నిందితుల అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details