తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చలికాచుకునేందుకు బైక్​నే తగలబెట్టాడు.. దొంగలించి మరీ!

మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగిన ఓ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. 10 బైక్​లను దొంగలించిన ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసున్నారు. వారిని విచారించి 9 బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. 10వ బైక్​ గురించి ముఠాలోని కీలక వ్యక్తిని ప్రశ్నించగా.. 'చలి ఎక్కువగా ఉంది. అందుకే చలికాచుకునేందుకు బైక్​ను తగలబెట్టాను,' అని సమాధానమిచ్చాడు.

stolen bike was set on fire to protect from the cold
stolen bike was set on fire to protect from the cold

By

Published : Dec 25, 2021, 1:05 PM IST

Updated : Dec 25, 2021, 5:02 PM IST

దొంగలించిన బైక్​ను తగలబెట్టి.. చలికాచుకున్నాడు!

ఈ ఏడాది శీతాకాలంలో చలి కారణంగా దేశప్రజలు వణికిపోతున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ దేశవ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో సాధారణంగా కొందరు.. కర్రలకు మంట పెట్టి చలికాచుకుంటారు. ఇంకొందరు ఇళ్లల్లో హీటర్​లను ఏర్పాటు చేసుకుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ దొంగ మాత్రం.. చలికాచుకునేందుకు.. తాను దొంగలించిన బైక్​నే ఉపయోగించుకున్నాడు!

దొంగ చలికాచుకున్న బైక్​

ఇదీ జరిగింది..

నాగ్​పుర్​లోని యశోధరా నగర్​లో ఇటీవలి కాలంలో బైక్​ల చోరీ కలకలం సృష్టించింది. తమ వాహనాలను దొంగలించారంటూ అనేక మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ ముఠాను గురించి తెలుసుకున్నారు. చోటా సర్ఫరాజ్​తో పాటు అతని నలుగురు అనుచరులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

విచారణలో భాగంగా.. ఆ ముఠా 10 బైక్​లను దొంగలించినట్టు తేలింది. వాటిల్లో.. 9 వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. 10వ బైక్​ గురించి చోటా సర్ఫరాజ్​ను ప్రశ్నించగా.. "చలి ఎక్కువగా ఉంటోంది. అందుకే చలి కాచుకునేందుకు ఆ బైక్​కు నిప్పుపెట్టాను," అని సమాధానమిచ్చాడు.

ఇదీ చూడండి:-5400 గులాబీలతో శాంటాక్లాజ్​ సైకత శిల్పం

Last Updated : Dec 25, 2021, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details