తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడుదొడుకుల్లో సూచీలు- 60 వేల 500 దిగువకు సెన్సెక్స్​

Stock markets
స్టాక్​ మార్కెట్లు

By

Published : Nov 9, 2021, 9:37 AM IST

Updated : Nov 9, 2021, 12:11 PM IST

12:00 November 09

మార్కెట్లు నష్టాల్లోనే..

స్టాక్​ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్​ 50పైగా పాయింట్లు కోల్పోయి.. 60,460 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​సీ-నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి.. 18,054 వద్ద ట్రేడవుతోంది.

10:02 November 09

అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో సానుకూలంగా ప్రారంభమైన సూచీలు.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్​ 50 పాయింట్లకుపైగా కోల్పోయి 60,486 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 18,070 వద్ద ఫ్లాట్​గా ట్రేడవుతోంది.

ఎఫ్​ఎంసీజీ, లోహ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండగా.. ఆటో షేర్లు రాణిస్తున్నాయి.

09:05 November 09

ఫ్లాట్​గా దేశీయ మార్కెట్​ సూచీలు

దేశీయ స్టాక్​ మార్కెట్లు (Stock Market) సూచీలు మంగళవారం.. ఫ్లాట్​గా ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ ప్రస్తుతం 60 పాయింట్లు లాభపడి.. 60,600 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 18,095 వద్ద కొనసాగుతోంది.

ఎం అండ్​ ఎం, సన్​ఫార్మా, ఇండస్​ బ్యాంకు, టాటా స్టీల్​ ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.

హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, నెస్లే, పవర్​గ్రిడ్​, కొటక్​ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Nov 9, 2021, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details