National herald case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో బుధవారం ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. తాను రాలేనని దర్యాప్తు సంస్థను అభ్యర్థించారు. కొవిడ్ నుంచి కోలుకోలేనందున విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. సోనియాకు జూన్ 2న కరోనా నిర్థారణ కాగా.. ఆమె ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆమెకు నెగటివ్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరుకాలేనని అభ్యర్ధించారు.
ఈ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ జూన్13న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అసలు గాంధీ జూన్ 2నే ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. కానీ.. ప్రస్తుతం భారత్‌లో లేనందున విచారణకు అందుబాటులో ఉండబోనని ఈడీకి సమాచారం అందించారు రాహుల్. షెడ్యూల్ ప్రకారం తనకు వివిధ కార్యక్రమాలు ఉన్నాయని వెల్లడించారు. అందుకు సమ్మతించిన ఈడీ.. జూన్ 13న దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి విచారణకు రావాలని మళ్లీ సమన్లు పంపింది.