ఉత్తర్‌ప్రదేశ్ పీలీభీత్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది(up crime news). ఓ వితంతువు, ఆమె కుటుంబసభ్యులపై పొరుగింటి అన్నదమ్ములు దాడి చేశారు. ఆ మహిళ జననాంగంలోకి కర్రను చొప్పించి హింసించారు.
ఇదీ జరిగింది..
కొత్వాలి ప్రాంతంలో నివసిస్తున్న మహిళ భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. అప్పటి నుంచి కుటుంబసభ్యులతో ఆమె ఉంటోంది. శుక్రవారం ఆమె ఇంటిపై పొరుగునే ఉన్న అన్నదమ్ములు రమామూర్తి- రామ్‌సాగర్, మరో ఇద్దరు కలిసి దాడి చేశారు. వితంతువు కుటుంబసభ్యులను చితకబాదారు. ఈ క్రమంలోనే ఆమె మీదకు దూసుకెళ్లి హత్యాయత్నం చేశారు. ఈ క్రమంలోనే వితంతువు జననాంగంలోకి కర్రను చొప్పించారు. పాత కక్షల కారణంగా వారు దాడి చేసినట్టు తెలుస్తోంది(crime news India).