Step Son Compliant On Step Mother Age : టీచర్లుగా పనిచేసే తల్లి, ఆమె కుమారుడు వయసుల మధ్య కేవలం 7ఏళ్లు మాత్రమే తేడా ఉందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి, విద్యాశాఖకు ఫిర్యాదు చేశాడు సవతి కుమారుడు. తల్లీకొడుకుల మధ్య ఇంత తక్కవ వయసు తేడా ఉండటం ఎలా సాధ్యమని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం ఉన్నతాధికారులకు సమర్పించాడు. దీంతో ఒక్కసారిగా విద్యాశాఖ అధికారులు కంగుతిన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. బిహార్‌లోని సీతామఢీ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు సతీశ్ పాశ్వాన్.. రామ్ ప్రకాశ్ పాశ్వాన్ మొదటి భార్య కొడుకు. కామిని కుమారి అనే మహిళ రామ్ ప్రకాశ్ పాశ్వాన్ మొదటి భార్య. ఈమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. వీరి కొడుకు సుశీల్ కుమార్. ఆయన కూడా టీచర్‌గానే పనిచేస్తున్నాడు. కామిని కుమారి పరిహార్ బ్లాక్‌లోని మన్‌పుర్ అప్‌గ్రేడెడ్ మిడిల్ స్కూల్లో ఈ మధ్యే టీచర్‌గా నియమాకం అయింది. ఆమె పెద్ద కొడుకు సుశీల్ కుమార్ కూడా పోఖర్ తోలా బరియార్‌పుర్‌లోని దుమ్రా ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ అయ్యాడు.