తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికా ప్రకటనతో విమాన ఛార్జీలకు రెక్కలు

అత్యవసరం అయితే తప్ప భారత్​కు ప్రయాణాలు చేయవద్దని అమెరికా సూచించిన నేపథ్యంలో ఈ రూట్లలో తిరిగే విమాన టికెట్​ ధరలు అమాంతం పెరిగాయి. కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్న వేళ ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తే.. ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందన్న భయంతో ప్రయాణికులు అమెరికా దారి పడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

flights, India-US
అమెరికా పిలుపుతో పెరిగిన విమాన ఛార్జీలు

By

Published : Apr 25, 2021, 4:55 PM IST

భారత్​-అమెరికా మధ్య తిరిగే విమానాల ఛార్జీలను ఆయా సంస్థలు గణనీయంగా పెంచినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశీయంగా కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో భారత్​కు ప్రయాణించడం శ్రేయస్కరం కాదని అమెరికా ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ఈ నేపథ్యంలో ప్రయాణాలకు అధిక డిమాండ్​ ఏర్పడినట్లు వివరించాయి. గతంలో భారత్​-అమెరికా సర్వీసుల్లో ఎకానమీ క్లాస్ టికెట్ కోసం రూ. 50 వేలు చెల్లించాల్సి ఉండగా.. ప్రస్తుతం రూ.1.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి.

"చాలా మంది ప్రయాణికులు అమెరికాకు తిరిగి వెళ్లాలని చూస్తున్నారు. కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతోన్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందన్న భయం వారిలో ఉంది. దీంతో టికెట్​కు అధిక డిమాండ్​ ఏర్పడింది. రేట్లు పెరిగాయి."

- పరిశ్రమ వర్గాలు

జర్మనీ, యూకే, యూఏఈ సహా మరికొన్ని దేశాలు భారత్​ నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించాయి.

మరోవైపు దేశంలో చార్టర్డ్​ విమానాలకు అధిక డిమాండ్​ ఏర్పడినట్లు ఓ విమాన సంస్థ ప్రతినిధి తెలిపారు. కరోనా సోకిన సంపన్నులు ఎయిర్​ అంబులెన్స్​గా చార్టర్డ్​ ఫ్లైట్లు ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ఛార్జీలు కూడా రెండు రెట్లు పెరిగినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:అత్యవసరమైతేనే భారత్​కు వెళ్లండి: అమెరికా

ABOUT THE AUTHOR

...view details