మహాలో కరోనా ఉగ్రరూపం - కొత్తగా 62 వేల కేసులు - Maharashtra cases
మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 62 వేల మందికి వైరస్ సోకింది. కర్ణాటకలో కేసులు స్వల్పంగా తగ్గాయి. అయితే తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కొవిడ్ ఉద్ధృతి ఆందోళనకరంగా మారుతోంది.
కరోనా కేసులు
By
Published : May 6, 2021, 11:17 PM IST
మహారాష్ట్రలో కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 62,194 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50 లక్షలకు చేరింది. మరో 853 మంది వైరస్ ధాటికి బలయ్యారు. రికార్డు స్థాయిలో 63,842 మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు.
స్వల్పంగా తగ్గిన కేసులు..
కర్ణాటకలో కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 49,058 కేసులు బయటపడ్డాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 18 లక్షలకు చేరువైంది. మరో 328 మంది చనిపోయారు. మరో 18,943 మంది కోలుకున్నారు.
ఉగ్రరూపం..
కేరళలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా 42,464 మందికి వైరస్ సోకింది. మరో 63 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆందోళనకరంగా..
తమిళనాడులో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఒక్కరోజే 24,898 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13 లక్షలకు చేరువైంది. మరో 195 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 15 వేలకు చేరువైంది.