Corona cases in India: భారత్‌లో వివిధ రాష్ట్రాల్లో రోజువారి కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. అయితే కేరళలో కొవిడ్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒక్క రోజే 22 వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు.
State Wise Corona cases in India
By
Published : Jan 17, 2022, 9:01 PM IST
Corona cases in India: దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. కర్ణాటకలో రోజువారి కొవిడ్ కేసులు దిగొచ్చాయి. కొత్తగా 27,156 కేసులు నమోదవగా.. 14 మంది చనిపోయారు. 7,827 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,17,297కు తగ్గింది.
మహారాష్ట్రలోనూ కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 31,111 మందికి వైరస్ సోకింది. మరో 24 మంది మృతి చెందారు. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,67,334కు చేరింది. అయితే 122 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.
దేశంలోని ప్రధాన నగరాలు దిల్లీ, ముంబయిలో కొవిడ్ బాధితులు భారీగా తగ్గారు. దిల్లీలో తాజాగా 12,527 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలగా.. 24 మంది చనిపోయారు. పాజిటివిటీ రేటు 27.99 శాతంగా ఉంది.
ముంబయిలో కొత్తగా 5,956 కేసులు నమోదవగా.. 12 మంది చనిపోయారు. దీంతో నగరంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 50,757కు చేరింది.
మరోవైపు కేరళలో కొత్తగా 22,946 మందికి వైరస్ సోకింది. మరో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. గతవారంతో పోల్చితే.. 182 శాతం కేసులు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.