తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనాతో పోరాడిన జవాన్లకు శౌర్య పతకాల ప్రదానం

సరిహద్దు ఘర్షణల్లో భాగంగా (China India Clash) చైనా సైన్యంతో పోరాడి పరాక్రమాలను చాటిన 20 మంది ఐటీబీపీ సిబ్బందికి కేంద్రం శౌర్య పతకాలు (Gallantry Award Winners 2021) ప్రదానం చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్.. జవాన్లకు మెడల్స్ అందించారు.

CHINA ITBP MEDALS
ఐటీబీపీ జవాన్లకు శౌర్య పతకాలు

By

Published : Oct 24, 2021, 4:08 PM IST

చైనాతో భారత్​కు ఉన్న సరిహద్దును పరిరక్షించే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)కు (ITBP news) చెందిన 20 మంది సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం శౌర్యపతకాలతో సత్కరించింది. 2020 మే- జూన్ మధ్య చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు ఈ అవార్డులు (Gallantry Award Winners 2021) అందించింది. ఐటీబీపీ 60వ రైజింగ్ డే (ITBP raising day 2021) ఉత్సవాల సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్.. జవాన్ల యూనిఫాంకు మెడల్స్ (ITBP awards 2021) అమర్చారు.

మెడల్ అందిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్
ప్రశంస పత్రం అందజేత

స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందు ఈ అవార్డులకు (Gallantry Award Winners 2021) ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. జూన్ 15న జరిగిన గల్వాన్ ఘర్షణల్లో (Galwan skirmish) పరాక్రమాలు చాటినందుకు ఎనిమిది మంది సిబ్బందికి పోలీసు శౌర్య పతకాలు అందించారు. మే 18న ఫింగర్ 4 వద్ద జరిగిన హింసాత్మక ఘర్షణలో చైనా సైనికులను సమర్థంగా ఎదుర్కొన్నందుకు ఆరుగురికి, అదే రోజు హాట్​స్ప్రింగ్ వద్ద పోరాడినందుకు మరో ఆరుగురికి ఈ పతకాలు అందించారు.

మరికొందరికీ...

మరోవైపు, ఛత్తీస్​గఢ్​ నక్సల్ ఆపరేషన్స్​లో ధైర్యంగా పోరాడిన ముగ్గురు ఐటీబీపీ సిబ్బందికి సైతం పీఎంజీ పతకాలను అందించింది కేంద్రం. ఐటీబీపీ జంతు రవాణా విభాగంలో విశేష సేవలందించిన డీఐజీ (వెటర్నరీ) సుధాకర్ నటరాజన్​ను సైతం మెడల్​తో సత్కరించింది.

1962 అక్టోబర్ 24న ఐటీబీపీని నెలకొల్పారు. సుమారు 90 వేల మంది సిబ్బంది ప్రస్తుతం ఈ విభాగం కింద పనిచేస్తున్నారు. వీరంతా ఆర్మీతో సమానంగా వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చదవండి:18వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ జవాన్ల యోగా

ABOUT THE AUTHOR

...view details