బంగాల్లోని ఓ వ్యాక్సిన్ కేంద్రంలో తీవ్ర తోపులాట (vaccine stampede) జరిగింది. ఈ ఘటనలో 25 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఒక్కసారిగా ఎగబడి..
బంగాల్లోని ఓ వ్యాక్సిన్ కేంద్రంలో తీవ్ర తోపులాట (vaccine stampede) జరిగింది. ఈ ఘటనలో 25 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఒక్కసారిగా ఎగబడి..
"జల్పాయిగుడీలోని ధూప్గుడీ ఆరోగ్య కేంద్రానికి టీకాల కోసం వందలాది జనం తరలివచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా గేటు వద్దనే గుమిగూడారు. వారిని అదుపుచేసేందుకు అప్పటికే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో గేటు తెరవగానే ఒక్కసారిగా తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది," అని అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో మహిళలు కూడా గాయపడ్డారని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ తొక్కిసలాట కారణంగా.. ఆ కేంద్రంలో టీకా పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది.
ఇదీ చూడండి:కరోనా కొత్త వేరియంట్- అన్నింటికంటే డేంజర్!