తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అధికారంలోకి వస్తే గృహిణులకు నెలకు రూ. వెయ్యి' - సిరుగానూరులో పార్టీ బహిరంగ సభ

తమిళనాట ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ గృహిణులకు నెలకు రూ. వెయ్యి ఇస్తామని చెప్పారు.

Stalin's seven promises ahead of election battle
గృహిణులకు నెలకు వెయ్యి!

By

Published : Mar 8, 2021, 5:47 AM IST

తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తే రేషన్​ కార్డులో కుటుంబ పెద్దగా పేర్కొన్న గృహిణులకు ప్రతి నెల రూ. వెయ్యి ఆర్థికసాయం చేస్తామని ఆ పార్టీ నాయకుడు స్టాలిన్​ ప్రకటించారు. తమిళనాడు తిరుచ్చి జిల్లా సిరుగానూరులో పార్టీ బహిరంగ సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. 'స్టాలిన్​ 7 ఉరుదిమొళిగళ్​'(స్టాలిన్​ ఏడు వాగ్దానాలు)ను ప్రకటించారు.

మెరుగైన తాగునీటి సరఫరా, నీటి వృథా తగ్గింపు, హరిత విస్తీర్ణం 25శాతానికి పెంపు, రైతు దిగుబడుల పెంపునకు చర్యలు, అందరికీ ఉన్నత విద్య, ఉన్నత స్థాయి వైద్యం, సుందర మహానగరాల రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఏడాదికి 10 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'సైబర్​ సామర్థ్యాలను మెరుగుపరిచే వ్యవస్థ అవసరం'

ABOUT THE AUTHOR

...view details