చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను(rajinikanth health news) తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తలనొప్పి, అస్వస్థత కారణంగా రజనీ(Rajini Latest News)ను గురువారం ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఆయనకు సర్జరీ(కారోటిడ్ ఆర్టరీ రివాస్కులైజేషన్) జరిగింది. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్ని రోజుల అనంతరం రజనీ ఆసుపత్రి నుంచి విడుదల అవుతారని స్పష్టం చేశారు.
రజనీని పరామర్శించిన స్టాలిన్ 70ఏళ్ల రజనీకాంత్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకునేందుకు కొన్ని రోజుల క్రితం దిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులను కలిశారు. చెన్నైకి తిరిగొచ్చిన అనంతరం ఆసుపత్రిలో చేరారు.
ఆసుపత్రి వద్ద సీఎం కాన్వాయ్ రజనీ కోలుకోవాలని ప్రత్యేక పూజలు
రజనీకాంత్ కోలుకోవాలని అభిమానుల ప్రత్యేక పూజలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని మధురైలోని తిరుపంకింద్రమ్ మురుగన్ ఆలయంలో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే.. అన్నత్తే (పెద్దన్న) సినిమా పెద్ద హిట్టవ్వాలని భగవంతుడిని వేడుకున్నారు. స్వామివారికి 108 టెంకాయలు సమర్పించుకున్నారు. అనంతరం వరద పాశం (నేలపై ప్రసాదం తినటం) చేపట్టారు. 'అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మా సూపర్ స్టార్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. ఆయన త్వరగా కోలుకోవాలని, రానున్న సినిమా విజయవంతం కావాలని పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశాం.' అని కుమారవేల్ అనే అభిమాని తెలిపారు.
ఆలయంలో అభిమానల ప్రత్యేక పూజలు నేలపైనే ప్రసాదం తీసుకుంటున్న అభిమానులు రజనీకాంత్ కోలుకోవాలని అభిమానుల ప్రదర్శన ఇదీ చూడండి:-ఆయన లేకపోవడం బాధగా ఉంది