తమిళనాట జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందకు కావాల్సిన స్పష్టమైన మెజారిటీని సాధించింది డీఎంకే కూటమి. దీంతో తొలిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్. ఈ తరుణంలో తన పార్టీకి ఓటు వేసి అఖండ విజయాన్ని అందించిన తమిళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వారి కోసం నిజాయతీగా పనిచేస్తానని వారికి హామీ ఇచ్చారు.
తమిళ ప్రజలకు స్టాలిన్ కృతజ్ఞతలు - తమిళ ప్రజలకు కృతజ్ఞతలు
తమిళనాట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించింది. ఘన విజయం అందించిన అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు డీఎంకే అధినేత స్టాలిన్. నిజాయతీగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
తమిళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన స్టాలిన్
ఆరోవసారి తమ పార్టీకి అధికారం అప్పజెప్పిన తమిళులకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నట్లు పేర్కొన్నారు స్టాలిన్.
ఇదీ చూడండి:డీఎంకే సక్సెస్ మంత్ర.. 'స్టాలిన్'!