తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రిలో చేరిన సీఎం స్టాలిన్.. ఆ సమస్యలతోనే! - stalin corona news

Stalin health condition: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​.. చెన్నై కావేరి ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఆయన కరోనా బారిన పడ్డారు.

m k stalin corona
ఆస్పత్రిలో చేరిన స్టాలిన్.. ఆ సమస్యలతోనే!

By

Published : Jul 14, 2022, 12:51 PM IST

Stalin health condition: కొవిడ్​ సంబంధిత లక్షణాలతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు.​ చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
స్టాలిన్​ కరోనా బారినపడినట్లు మంగళవారం వెల్లడించారు. "ఈరోజు కాస్త అలసటగా అనిపించింది. పరీక్షలు చేయిస్తే.. కరోనా పాజిటివ్ అని తేలింది. నేను ఐసోలేషన్​లోకి వెళ్లాను. ప్రజలందరూ మాస్కులు ధరించాలి. టీకాలు వేయించుకోవాలి. ఇతర జాగ్రత్తలన్నీ తీసుకోవాలి" అంటూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు స్టాలిన్.
స్టాలిన్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు గవర్నర్​ ఆర్​ఎన్​ రవి సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details