తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అరుదైన ఘనత సాధించారు. రాష్ట్రంలో గ్రామసభకు హాజరైన తొలి ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలిచారు. అక్టోబరు 2, గాంధీ జయంతి సందర్భంగా మధురైలోని పప్పప్పట్టి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. గ్రామ కమిటీ తీర్మానించిన అంశాలపై చర్చించారు.
" దేశాభివృద్ధి గ్రామాల అభివృద్ధితో ముడిపడి ఉంది. స్థానిక సంస్థలు ఎప్పుడూ దృఢంగా ఉండాలి. ఈ గ్రామంతో నాకు చాలా అనుబంధం ఉంది. చాలా ఏళ్లపాటు పప్పప్పట్టి, కీరిపట్టి, నట్టేరుమంగళమ్, కొట్టాకచియెండల్ గ్రామలకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. మా నాన్న సీఎంగా ఉన్నసమయంలో ఈ గ్రామాలకు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం. ఆ సమయంలో నేను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాను."