SSC Stenographer Vacancy 2023 : కేంద్రప్రభుత్వం పరిధిలోని వివిధ సంస్థల్లో ఉద్యోగిగా స్థిరపడాలని కలలు కనేవారికి శుభవార్త చెప్పింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ). కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డీ కింద మొత్తం 1207 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి బుధవారం ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 23లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
ఖాళీలు..
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సీ- 93 పోస్టులు
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డీ- 1114
ముఖ్యమైన తేదీలు..
- అప్లికేషన్ స్వీకరణ ప్రారంభ తేదీ- 2023 ఆగస్టు 2
- చివరితేదీ- 2023 ఆగస్టు 23(రాత్రి 11:00 వరకు)
- అప్లికేషన్ ఫామ్ లేదా ఆన్లైన్ చెల్లింపుల్లో ఏమైనా తప్పులు ఉంటే 24, 25 తేదీల్లో రాత్రి 11 గంటల వరకు సరిదిద్దుకోవచ్చు.
వీరు మాత్రమే అర్హులు..
SSC Stenographer Eligibility : ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్‌తో పాటు స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
దరఖాస్తు రుసుము..
- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు- రూ.100/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
వయో పరిమితి..
- స్టెనోగ్రాఫర్(గ్రేడ్-సీ)- 2023 ఆగస్టు 1 నాటికి 18-30 సంవత్సరాలలోపు ఉండాలి.
- స్టెనోగ్రాఫర్(గ్రేడ్-డీ )- 18-27 ఏళ్లలోపు ఉండాలి.
వయోపరిమితి సడలింపులు..
- ఎస్సీ/ఎస్టీ- 5 ఏళ్లు
- ఓబీసీ- 3 ఏళ్లు
- దివ్వాంగులు(అన్రిజర్వ్డ్)- 10 ఏళ్లు
- దివ్వాంగులు(ఓబీసీ)- 13 ఏళ్లు
- దివ్వాంగులు(ఎస్సీ/ఎస్టీ)- 15 ఏళ్లు
- ఎక్స్-సర్వీస్‌మెన్- 3 ఏళ్లు
పరీక్ష తేదీలు..
SSC Stenographer Exam Dates : 2023 అక్టోబరు 12,13 తేదీల్లో.
పరీక్ష విధానం..
SSC Steno Selection Process : సీబీటీ లేదా ఆన్లైన్ విధానంలో వివిధ షిఫ్టుల్లో పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో పాసైన అభ్యర్థులను స్టెనో స్కిల్ టెస్టుకు పిలుస్తారు. 10 నిమిషాల వ్యవధిలో నిమిషానికి వంద హిందీ/ఇంగ్లిష్ పదాలు టైప్ చేసే సామర్థ్యాన్ని ఈ స్కిల్ టెస్టులో పరీక్షిస్తారు. ఇది గ్రూప్ డి అభ్యర్థులకు. గ్రూప్ సి అభ్యర్థులు 10 నిమిషాల వ్యవధిలో నిమిషానికి 80 హిందీ/ఇంగ్లిష్ పదాలు టైప్ చేయాల్సి ఉంటుంది.
పరీక్ష వివరాలు..
మొత్తం 200 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. 2 గంటల సమయం. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఇంగ్లిష్ తదితర అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. హింది, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే ప్రశ్నాపత్రం ఉంటుంది(పార్ట్-III మినహాయించి). ఈ పరీక్షకు 1/3 నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఉదాహరణకు ఒక ప్రశ్నకు 2 మార్కులను కేటాయించారు. మీరు 1 తప్పు సమాధానం పెట్టారు.. అప్పుడు సరైన సమాధానాలకు మీరు సంపాదించిన మార్కుల నుంచి 0.66 మార్కులను కట్ చేస్తారు.
పరీక్ష కేంద్రాలు..
SSC Stenographer Exam Centre List : హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం, త్రిస్సూర, ముంబయి, చెన్నై, మధురై సహా వివిధ నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
అఫిషియల్ వెబ్సైట్..
SSC Official Website : నోటిఫికేషన్‌కు సంబంధించి సిలబస్, కటాఫ్ మార్కులు వంటి మరిన్ని వివరాల కోసం www.ssc.nic.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు.