SSC MTS Jobs 2023 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. కనీస విద్యార్హత 10వ తరగతి మాత్రమే. ఆసక్తి గల అభ్యర్థులు జులై 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్) - 1198 పోస్టులు
- హవల్దార్ - 360 పోస్టులు
నోట్ :ఈ పోస్టులు గ్రూప్ - సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ కేటగిరీకి చెందినవి.
విద్యార్హతలు ఏమిటి?
SSC MTS 2023 Eligibility : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా విద్యాసంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి ఎంత?
SSC MTS 2023 AGE Limit : 2023 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు ఆయా పోస్టులను అనుసరించి 18 నుంచి 25 సంవత్సరాలు లేదా 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు రుసుము వివరాలు :
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
- జనరల్, ఓబీసీ కేటగిరీల వారు మాత్రం దరఖాస్తు రుసుము కింద రూ.100 ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సెషన్ 1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణత సాధించిన వారిని.. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
- హవల్దార్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయినవారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పరీక్ష కేంద్రాలు : చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం
తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
ముఖ్యమైన తేదీల వివరాలు
- ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2023 జూన్ 30
- ఆన్లైన్ దరఖాస్తులకు ఆఖరు తేదీ : 2023 జులై 21
- ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 2023 జులై 22
- ఆఫ్‌లైన్ చలానా జనరేషన్‌కు చివరి తేదీ : 2023 జులై 24
- దరఖాస్తు సవరణకు అవకాశం : 2023 జులై 26 నుంచి 2023 జులై 28 వరకు
- కంప్యూటర్ బేస్డ్ పరీక్ష తేదీ : 2023 సెప్టెంబర్
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఎస్ఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.