SSC Hindi Translator Jobs : హిందీ ప్రధానాంశంగా చదివి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 307 ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ( SSC Recruitment 2023 )
ఉద్యోగాల వివరాలు
SSC Hindi Translator Posts :
- జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ - 10 పోస్టులు
- సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ - 10 పోస్టులు
- జూనియర్ ట్రాన్స్‌లేటర్ - 287 పోస్టులు
విద్యార్హతలు
SSC Hindi Translator Eligibility :
- జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ :అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లీష్ పాఠ్యాంశంగా చదివి ఉండాలి. అలాగే హిందీ నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయడంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ క్వాలిఫై అయ్యుండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో రెండేళ్ల అనువాద అనుభవం ఉండాలి.
- జూనియర్ ట్రాన్స్‌లేటర్ : అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. హిందీ నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయడంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ క్వాలిఫై అయ్యుండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో మూడు ఏళ్ల అనువాద అనుభవం ఉండాలి.
- సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ :అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లీష్ చదివి ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో సీనియర్ సెకెండరీ స్థాయిలో రెండేళ్ల హిందీ బోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి
SSC Hindi Translator Age Limit : అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.