తెలంగాణ

telangana

ETV Bharat / bharat

10వ తరగతి పాసైన వారికి 25వేల ప్రభుత్వ ఉద్యోగాలు - ఎస్​ఎస్​సీ జీడీ కానిస్టేబుల్ 2021

స్టాఫ్​ సెలక్షన్ కమిషన్​ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు సిద్ధమవ్వండి. 25 వేల జీడీ కానిస్టేబుల్​(GD Constable) పోస్ట్​లకు నోటిఫికేషన్ విడులదలైంది.

ssc, ssc gd
ఎస్​ఎస్​సీ, ఎస్​ఎస్​సీ జీడీ

By

Published : Jul 17, 2021, 5:06 PM IST

Updated : Jul 17, 2021, 5:20 PM IST

నిరుద్యోగులకు శుభవార్త. ఎస్​ఎస్​సీ(SSC)లో 25 వేల జీడీ కానిస్టేబుల్(GD Constable) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 25,271 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎస్​ఎస్​సీ. ఇందులో 10 శాతం ఉద్యోగాలు ఎక్స్​ సర్వీస్​మెన్(ఈఎస్​ఎమ్) కోటా కింద ఉన్నట్లు తెలిపింది.

పరీక్ష:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష

ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్

దేహదారుడ్య పరీక్ష

వైద్య పరీక్షలు

డాక్యుమెంట్ వెరిఫికేషన్

అర్హత:

వయస్సు: 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్​ ఉన్నవారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హత: కనీసం పదవతరగతి పాసై ఉండాలి.

పరీక్ష విధానం:

తొలుత కంప్యూటర్ ఆధారిత పరీక్ష(టైర్-1) నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్​ టైప్​లో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు 0.25 నెగటివ్​ మార్కింగ్​ ఉంటుంది. ప్రశ్నలు.. ఆంగ్లం, హిందీ భాషల్లో ఉంటాయి.

పార్ట్ సబ్జెక్ట్ ప్రశ్నల సంఖ్య మార్కులు సమయం
పార్ట్- ఏ జనరల్ ఇంటలిజన్స్ అండ్ రీజనింగ్ 25 25 90 నిమిషాలు
పార్ట్ - బీ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్​నెస్ 25 25
పార్ట్- సీ ఎలిమెంటరీ మాథ్స్ 25 25
పార్ట్- డీ ఇంగ్లీష్/ హిందీ 25 25

ఫీజు:

అప్లికేషన్​కు 100 రూపాయాలు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్సీ కేటగిరీ వారు, ఎక్స్​ సర్వీస్​మెన్ కోటా వారికి ఫీజు మినహాయింపు ఉంది.

జీతం:

ఉద్యోగానికి ఎంపికైన వారికి గ్రేడ్ 3 లెవల్​ కింద రూ. 21,700-రూ. 69,100 వరకు జీతం ఉంటుంది.

అప్లికేషన్​ కోసం ssc.nic.in వెబ్​సైట్​ను చూడాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:7 వేల SSC ఉద్యోగాలకు పరీక్ష ఎప్పుడంటే?

Last Updated : Jul 17, 2021, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details