SSC GD Constable Jobs 2023 :స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 75,768 జీడీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్ఐఏ తదితర పోలీస్ ఫోర్స్ల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు.
1. పురుషులకు కేటాయించిన ఉద్యోగాల వివరాలు
- బీఎస్ఎఫ్ - 24,806 పోస్టులు
- సీఐఎస్ఎఫ్ - 7877 పోస్టులు
- సీఆర్పీఎఫ్ - 22,196 పోస్టులు
- ఎస్ఎస్బీ - 4839 పోస్టులు
- ఐటీబీపీ - 2564 పోస్టులు
- ఏఆర్ - 4624 పోస్టులు
- ఎస్ఎస్ఎఫ్ - 458 పోస్టులు
- మొత్తం పోస్టులు - 67,364
2. మహిళలకు కేటాయించిన ఉద్యోగాల వివరాలు
- బీఎస్ఎఫ్ - 3,069 పోస్టులు
- సీఐఎస్ఎఫ్ - 721 పోస్టులు
- సీఆర్పీఎఫ్ - 3231 పోస్టులు
- ఎస్ఎస్బీ - 439 పోస్టులు
- ఐటీబీపీ - 442 పోస్టులు
- ఏఆర్ - 152 పోస్టులు
- ఎస్ఎస్ఎఫ్ - 125 పోస్టులు
- మొత్తం పోస్టులు - 2626
3. ఎన్ఐఏ - 225 పోస్టులు
విద్యార్హతలు
SSC GD Constable Qualification :అభ్యర్థులు 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
SSC GD Constable Age Limit :అభ్యర్థుల వయస్సు 2023 జనవరి 1 నాటికి 23 ఏళ్ల లోపు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
SSC GD Constable Application Fee :అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, మహిళలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ
SSC GD Constable Selection Process :
- అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బైస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తారు. పరీక్ష పేపర్లో జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్/ హిందీ సబ్జెక్ట్స్కు సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 1 గంట మాత్రమే ఉంటుంది.
- ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (PET)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) నిర్వహిస్తారు. ఈ శారీరక దృఢత్వ పరీక్షల్లో అభ్యర్థులు క్వాలిఫై కావాల్సి ఉంటుంది.
- పీఈటీ, పీఎస్టీల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి, ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.