నిరుద్యోగులకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(సీజీఎల్)-2020 పరీక్షకు రంగం సిద్ధమైంది. దాదాపు 7 వేల పోస్టుల భర్తీ కోసం నిర్వహించే ఈ ఎగ్జామ్‌ను ఆగస్టులో జరపనున్నట్లు సమాచారం. ఈ నెలలో హాల్ టికెట్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జనవరిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన ఎస్ఎస్సీ బోర్డు.. గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల పరీక్షను మే 29 నుంచి జూన్ 7 మధ్య పరీక్షలు నిర్వహించాలని అనుకుంది. పలు కారణాల వల్ల నిలిచిన ఆ ఎగ్జామ్స్‌ను ఇప్పుడు ఆగస్టు 13-24 మధ్య నిర్వహించాలని భావిస్తున్నారట.