తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీటెక్​, డిగ్రీ, డిప్లొమా అర్హతతో SSBలో ఎస్​ఐ ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

SSB SI Jobs 2023 : సశస్త్ర సీమ బల్‌లో 111 సబ్​ ఇన్​స్పెక్టర్-ఎస్​ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. మరి ఈ కొలువులకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన విద్యాఅర్హతలు, దరఖాస్తు చివరి తేదీ, అప్లికేషన్​ ఫీజు తదితర వివరాలు మీకోసం.

SSB Sub Inspector Recruitment 2023
SSB SI Jobs 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2023, 9:50 AM IST

SSB SI Jobs 2023 :పోలీసు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు గుడ్​న్యూస్​. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సశస్త్ర సీమ బల్‌(ఎస్‌ఎస్‌బీ) 2023 సంవత్సరానికి సంబంధించి మొత్తం 111 సబ్​ ఇన్​స్పెక్టర్​(SI) పోస్టులను (SSB SI Recruitment 2023) భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల యువతీయువకులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్​ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

పోస్టులు(SSB SI Vacancy 2023)..

  • సబ్​-ఇన్​స్పెక్టర్​(పయోనీర్)​- 20
  • సబ్​-ఇన్​స్పెక్టర్​(డ్రాట్స్​మెన్)​- 3
  • సబ్​-ఇన్​స్పెక్టర్​(కమ్యూనికేషన్)- 59
  • సబ్​-ఇన్​స్పెక్టర్​(స్టాఫ్​ నర్స్-ఫీమేల్​)- 29

విద్యార్హతలు(SSB SI Qualification)..

  • ఎస్​ఐ- పయోనీర్​ : డిగ్రీ, సివిల్​ ఇంజినీరింగ్​లో డిప్లొమా
  • ఎస్​ఐ- డ్రాట్స్​మెన్​ : పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
  • ఎస్​ఐ- కమ్యునికేషన్​ : ఎలక్ట్రానిక్స్​ అండ్​ కమ్యూనికేషన్​, కంప్యూటర్ సైన్స్​లో డిగ్రీ​, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్​
  • ఎస్​ఐ- స్టాఫ్​ నర్స్(ఫీమేల్​) : ఇంటర్మీడియేట్​

ఏజ్​ లిమిట్(SSB SI Age Limit)​..

  • అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. స్టాఫ్​ నర్స్ పోస్టులకు అప్లై చేసుకునే యువతులు 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ, ఎస్​సీ, ఎస్​టీ అభ్యర్థులకు 3 నుంచి 5 ఏళ్ల వరకు వయో పరిమితి సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం(SSB SI PST Details 2023)..

  • ఫిజికల్​ స్టాండర్డ్​ టెస్ట్​(పీఎస్​టీ) లేదా దేహదారుఢ్య పరీక్షలు
  • రాత పరీక్ష

అప్లికేషన్ ఫీజు (SSB SI Application Fee)..

  • ఎస్​సీ, ఎస్​టీ, ఎక్స్-సర్వీస్​మెన్​ సహా మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు. పూర్తి ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
  • జనరల్​, ఈడబ్ల్యూఎస్​, ఓబీసీ అభ్యర్థులు రూ.200/- అప్లికేషన్​ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

ఎత్తు ఇంత ఉండాలి? (SSB SI Jobs Height)..

  • పురుషులు 170 సె.మీల ఎత్తు ఉండాలి. ఛాతీ సైజ్​- 80 సెంటిమీటర్లు, గాలి పీల్చినప్పుడు ఛాతీ అదనంగా 5 సె.మీలు పెరగాలి.
  • మహిళలు 157 సె.మీల ఎత్తు ఉండాలి.

అధికారిక వెబ్​సైట్​..
SSB Official Website :నోటిఫికేషన్​కు సంబంధించి మరిన్ని వివరాల కోసం SSB అధికారిక వెబ్​సైట్​ http://ssbrectt.gov.in/ను చూడవచ్చు.

దరఖాస్తు చివరితేదీ..
SSB SI Apply Last Date :2023 నవంబర్​ 19

పదితో కానిస్టేబుల్​ ఉద్యోగాలు..
SSB Constable Jobs 2023 : కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సశస్త్ర సీమ బల్‌(ఎస్‌ఎస్‌బీ) 2023 సంవత్సరానికి సంబంధించి స్పోర్ట్స్‌ కోటా కింద 272 కానిస్టేబుల్‌ పోస్టులను (SSB Constable Recruitment 2023) కూడా భర్తీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉండి అర్హత గల యువతీయువకులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన విద్యార్హతలు, వయో పరిమితి, జీతభత్యాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి తదితర పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

డిగ్రీ, ఐటీఐ అర్హతతో NLCలో 877 అప్రెంటీస్​ పోస్టులు - అప్లైకు మరో 6 రోజులే ఛాన్స్​!

ప్రభుత్వ రంగ బ్యాంకులో జాబ్స్​- రూ.లక్షకుపైగా శాలరీ! అప్లైకు లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details