తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు జవాన్లు మృతి - కరెంట్ తీగలు జవాన్లు

SSB jawan died: హైవోల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. టెంట్లు వేస్తుండగా ఈ ఘటన జరిగింది. మరో తొమ్మిది మంది జవాన్లు గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

ssb jawan died high voltage wire
విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు జవాన్లు మృతి

By

Published : Jan 14, 2022, 5:11 PM IST

SSB jawans died High voltage wire: బిహార్​లోని సుపౌల్ ప్రాంతంలో దుర్ఘటన జరిగింది. హై వోల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.

Current Wire killed Jawans Bihar

సశస్త్ర సీమాబల్​ 45బీ బెటాలియన్​కు చెందిన జవాన్లు.. టెంట్లు ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఎల్ఎన్ సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. నలుగురు జవాన్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు వెల్లడించారు. వీరిని దర్భంగా మెడికల్ కళాశాలకు తరలించారు.

విర్పుర్ ప్రధాన కేంద్రంగా 45బీ బెటాలియన్ పనిచేస్తోందని అధికారులు తెలిపారు. జవాన్లకు ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోందని చెప్పారు.

ఇదీ చదవండి:పూల మార్కెట్​లో బాంబు, కుక్కర్​లో గ్రెనేడ్- దగ్గరుండి పేల్చేసిన ఎన్​ఎస్​జీ

ABOUT THE AUTHOR

...view details