తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Drugs news: డ్రగ్స్​ కేసులో షారుక్ ఖాన్​ తనయుడు అరెస్ట్​ - ఆర్యన్ ఖాన్ డ్రగ్స్

ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్​ పార్టీలో (Mumbai Rave Party news) పట్టుబడ్డవారిలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Mumbai Rave Party Superstar Son) సైతం ఉన్నాడు. అతడిని ఇప్పటికే ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్​సీబీ) (Drugs news) అధికారులు అరెస్టు చేశారు. ఆర్యన్​ను ప్రశ్నించిన అనంతరం.. వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టులో ప్రవేశపెట్టగా.. రేపటివరకు ఎన్​సీబీ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

SRK's son Aryan Khan being questioned in Mumbai cruise drugs case
షారుక్ తనయుడు డ్రగ్స్ పార్టీ కేసు

By

Published : Oct 3, 2021, 12:29 PM IST

Updated : Oct 3, 2021, 8:00 PM IST

పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్న అధికారులు

ముంబయి రేవ్ పార్టీలో(Mumbai Rave party) పట్టుబడిన వారిలో బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (Mumbai Rave Party Superstar Son) సైతం ఉన్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Drugs news) స్పష్టం చేసింది. (Mumbai Rave Party news) పార్టీలో అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది వివరాలను ఎన్​సీబీ వెల్లడించింది. (Shah Rukh Khan son drugs) అనంతరం.. షారుక్​ తనయుడిని అరెస్టు చేసింది. ఇతడిని కోర్టులో ప్రవేశపెట్టగా.. రేపటివరకు ఎన్​సీబీ కస్టడీకి అప్పగించింది.

ఆర్యన్ ఖాన్​తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్​మున్ ధమేచ, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జైశ్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి(Mumbai Rave Party 2021) ఎన్​సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తెలిపారు. వీరిని ప్రశ్నించిన అనంతరం.. వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఎన్​డీపీఎస్​ సెక్షన్‌ 27 ప్రకారం వారిపై కేసు నమోదు చేసిన ఎన్​సీబీ అధికారులు.. తిరిగి కార్యాలయానికి తీసుకొచ్చారు.

నిఘా వేసి...

డ్రగ్స్ పార్టీ (Mumbai Rave Party on Cruise) జరుగుతోందన్న సమాచారంతో శనివారం రాత్రి ముంబయి తీరం నుంచి బయల్దేరిన క్రూయిజ్ నౌకపై ఎన్​సీబీ (Drugs news) ప్రత్యేక నిఘా పెట్టింది. సమీర్ వాంఖెడే నేతృత్వంలో పలువురు ఎన్​సీబీ అధికారులు ప్రయాణికుల్లా నౌకలోకి ప్రవేశించి.. రేవ్ పార్టీ గుట్టురట్టు చేశారు. ముంబయి నుంచి గోవాకు ఈ నౌక ప్రయాణిస్తోందని అధికారులు తెలిపారు. సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత పార్టీ ప్రారంభమైందని చెప్పారు. పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకొని ముంబయికి తరలించినట్లు వెల్లడించారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎన్​సీబీ.

షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్

రెండు వారాలుగా...

ఈ ఇన్వెస్టిగేషన్ పక్కా ప్రణాళికతో జరిగిందని ఎన్​సీబీ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. రెండు వారాల నుంచి దీనిపై పనిచేస్తున్నట్లు చెప్పారు. నిఘా వర్గాలు అందించిన నిర్దిష్ట సమాచారాన్ని వినియోగించి ఈ పార్టీ గుట్టురట్టు చేసినట్లు వివరించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్​ తారలతో ఉన్న లింకులు బయటపడ్డట్లు తెలిపారు.

అనంతరం తనిఖీలు నిర్వహించి డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాలను అనుమానితులు తమ దుస్తులు, లోదుస్తులు, పర్సులలో దాచేసుకున్నారని చెప్పారు. అదుపులోకి తీసుకున్నవారందరినీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు ఎన్​సీబీ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:మాదకశక్తులతో దేశ భవితవ్యం ఛిన్నాభిన్నం

Last Updated : Oct 3, 2021, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details