Srinagar crpf jawan killed: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని మైసుమా ప్రాంతంలో ఇద్దరు సీఆర్ఫీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. మైసుమా ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నట్లు చెప్పారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి - శ్రీనగర్‌లోని ముష్కరుల కాల్పుల్లో ఓ జవాన్ మరణం
Srinagar crpf jawan killed: జమ్ముకశ్మీర్‌లో సీఆర్ఫీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ఒక జవాన్ మృతి చెందాడు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు . మరోవైపు పుల్వామాలోని వలస కూలీలపై కాల్పులకు పాల్పడ్డారు ముష్కరులు. ఈ ఘటనలో ఇద్దరికి గాయలయ్యాయి.
మరోవైపు వలసదారులపై కూడా కాల్పులు జరిపారు ముష్కరులు. 24 గంటల వ్యవధిలో రెండు చోట్ల దాడులు చేశారు. పుల్వామా జిల్లాలో వలస కూలీలపై సోమవారం జరిపిన కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులు బిహార్‌కు చెందిన పట్లేశ్వర్ కుమార్, జాకో చౌదరిగా గుర్తించారు. లజోరా ప్రాంతంలో పనిచేస్తుండగా.. ముష్కరులు వీరిపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆదివారం సాయంత్రం.. పుల్వామాలోని నౌపొరా ప్రాంతంలో పంజాబ్‌కు చెందిన ఇద్దరు వలస కూలీలపైనా కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు.
ఇదీ చదవండి:పబ్జీ దోస్త్ కోసం 'రైలులో బాంబ్'.. పోలీసులు హడల్