శ్రీలంక అధికారులు అరెస్టు చేసిన 54 మంది భారత మత్స్యకారులలో 40 మంది శుక్రవారం విడుదలయ్యారు. వీరితో పాటు సీజ్ అయిన ఐదు ఓడల్లో నాలుగింటిని విడుదల చేశారని తమిళనాడు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. పుదుచ్చేరిలోని కరైకల్కి చెందిన 14 మంది జాలర్లు రేపు విడుదలయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
విడుదలైన మత్స్యకారులంతా తమిళనాడులోని రామేశ్వరం, నాగపట్నం, కరైకల్కి చెందిన వారు. శ్రీలంక అధీనంలోని సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేటకు వెళ్లారనే కారణంతో అక్కడి తీరప్రాంత అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.