తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీచైతన్యలో కరోనా కలకలం- 60మంది విద్యార్థులకు పాజిటివ్​! - బెంగళూరులో కరోనా

బెంగళూరులోని శ్రీచైతన్య విద్యాసంస్థలో 60 మంది విద్యార్థులకు కొవిడ్​ పాజిటివ్​గా(Corona virus) తేలింది. మొత్తం 480కి పరీక్షలను నిర్వహించగా 60మందికి నిర్ధరణ అయినట్లు విద్యాసంస్థల యాజమాన్యం తెలిపింది.

Sri Chaitanya educational institution Bengaluru
శ్రీచైతన్యలో కరోనా కలకలం

By

Published : Sep 29, 2021, 10:39 AM IST

బెంగళూరులోని శ్రీచైతన్య విద్యాసంస్థలో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 60 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌(Corona virus) తేలింది. దీంతో విద్యాసంస్థను అక్టోబర్​ 20 వరకు మూసివేసింది యాజమాన్యం.

మొత్తం 480 మందికి పరీక్షలు(corona tests) నిర్వహించగా.. 60 మందికి కొవిడ్​ నిర్ధరణ అయినట్లు బెంగళూరు అర్బన్​​ డిప్యూటీ కమిషనర్​ మంజునాథ్​ తెలిపారు. అయితే.. పాజిటివ్​గా తేలిన వారిలో ఇద్దరిలోనే లక్షణాలు(Covid symptoms) ఉన్నాయని, భయపడాల్సిందేమీ లేదని పేర్కొన్నారు. వైరస్ సోకిన విద్యార్థుల్లో 46 మంది కర్ణాటక వాసులు కాగా.. మిగిలిన 14 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు.

కరోనా తగ్గుముఖం పట్టిన క్రమంలో నెలరోజుల క్రితం శ్రీచైతన్య రెసిడెన్సియల్​ పాఠశాలను పునఃప్రారంభించారు.

ఇదీ చూడండి:Corona cases in India: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details