తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యాక్టర్ సచిన్ జోషికి షాక్- ఆ​ కేసులో రూ. 410 కోట్ల ఆస్తుల జప్తు!

SRA fraud case: మనీలాండరింగ్​ కేసులో ఓంకార్ గ్రూప్, యాక్టర్ సచిన్​ జోషికి(వైకింగ్​​ గ్రూప్​) చెందిన రూ.410 కోట్ల ఆస్తులను ఈడీ(ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​) జప్తు చేసింది.

omkar developers mumbai
రుణ కేసు

By

Published : Jan 15, 2022, 2:56 PM IST

Updated : Jan 15, 2022, 3:47 PM IST

SRA Fraud Case: నగదు అక్రమ రవాణా కేసులో మహారాష్ట్రకు చెందిన ఓంకార్ గ్రూప్, నటుడు, వ్యాపారవేత్త సచిన్​ జోషికి చెందిన వైకింగ్​​ గ్రూప్​ నుంచి రూ.410 కోట్ల ఆస్తులను ఈడీ(ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​) జప్తు చేసింది. ఇందులో ఓంకార్ గ్రూప్​కు చెందిన రూ.330 కోట్ల విలువ కలిగిన ఫ్లాట్​ను, సచిన్ జోషికి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.

ఈడీ ఆరోపణలు..

Case on Sachin Joshi: ముంబయి స్లమ్​ రీహబిలిటేషన్ అథారిటీ(ఎస్​ఆర్​ఏ) స్కీం ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని ఔరంగాబాద్​లో ఓ వ్యాపార వేత్త కేసు నమోదు చేశారు. దీనిపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో స్కీం కింద 2016లో లబ్దిదారుల సంఖ్యను అక్రమంగా పెంచారని ఈడీ ఆరోపించింది.

ఈ ప్రాజెక్టును ఓంకార్ గ్రూప్ చేపట్టగానే ఎస్ఆర్ఏ అధికారులు ఫ్లాట్ విలువను అమాంతం రూ.2.5 కోట్ల నుంచి రూ.4కోట్లకు పెంచారని ఈడీ అధికారులు ఆరోపించారు. దీనిపై అక్రమ పత్రాలను సృష్టించి రూ.410 కోట్లను యస్ బ్యాంకు నుంచి లోన్​గా తీసుకున్నారని దర్యాప్తులో తేల్చారు. ఈ డబ్బును ఎస్​ఆర్​ఏ ప్రాజెక్టులో వినియోగించకుండా ఇతర కంపెనీలకు అక్రమ రవాణా చేశారని ఈడీ తెలిపింది.

ఈ కేసులో ఓంకార్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బాబుల్ శర్మ, ఛైర్మన్ కమల్ కిషోర్​లను అరెస్టు చేసింది. అంతేకాకుండా ఈ కేసుతో సంబంధం ఉన్న జేఎమ్​ జోషి గ్రూప్ ప్రమోటర్​ సచిన్​ జోషిపై కూడా ఎఫ్​ఐఆర్ నమోదు చేసింది.

జర్నలిస్టుపై ఈడీ కొరడా..

దిల్లీ జర్నలిస్టు రాజీవ్ శర్మకు చెందిన రూ.48.21 కోట్ల విలువైన రెసిడెన్షియల్​​ ప్రాపర్టీని ఈడీ జప్తు చేసింది. శర్మపై.. దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా అధికారులకు చేరవేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు బదులుగా చైనా అధికారుల నుంచి రాజీవ్​ శర్మ.. డబ్బును కూడా పొందారని తెలిపింది. ఈ కేసులో గతేడాది జులైలో అరెస్టైన రాజీవ్ శర్మ.. గత వారమే బెయిల్​పై విడుదలయ్యారు.

ఇదీ చదవండి:రికార్డు స్థాయిలో 93 సార్లు ఎన్నికల్లో ఓటమి.. మళ్లీ బరిలోకి..

Last Updated : Jan 15, 2022, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details