తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మమతా బెనర్జీకి పదవీ గండం తప్పదా?

ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరథ్‌ సింగ్ మాదిరిగానే.. బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పదవీ గండాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. బంగాల్​లో ఖాళీగా ఉన్న భవానీపుర్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం మందుకు రాకపోతే.. తీరథ్‌ సింగ్ పరిస్థితే మమతకూ ఎదురు కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

west bengal cm, mamata benarjee, tmc chief
మమతా బెనర్జీ

By

Published : Jul 4, 2021, 5:56 AM IST

Updated : Jul 4, 2021, 6:57 AM IST

కరోనా తీసుకువచ్చిన తంటాలు ఇప్పుడు ముఖ్యమంత్రుల పీఠాలకూ పరోక్షంగా ఎసరు పెడుతున్నాయి. అసెంబ్లీలో సభ్యులుగా లేనివారు సీఎంగా ఎన్నికైతే గరిష్ఠంగా ఆరు నెలల్లోగా సభకు ఎన్నిక కావాలనేది రాజ్యాంగ నిబంధన. ఉత్తరాఖండ్‌లో అలాంటి అవకాశం లేక తీరథ్‌ సింగ్‌ రావత్‌ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన వైదొలగడానికి ఇదో ప్రధాన కారణం. ఇప్పుడు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషయంలోనూ ఇలాంటి ప్రమాద ఘంటికలే మోగుతున్నాయి. రావత్‌ మాదిరిగానే మమత కూడా శాసనసభ్యురాలు కాదు. నందిగ్రామ్‌లో పోటీ చేసి ఓడిపోయిన ఆమె మే 4న సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఈసీ ముందుకు రాకపోతే..

రాజ్యాంగం ప్రకారం నవంబరు 4లోగా ఎమ్మెల్యేగా మమత ఎన్నిక కావాల్సి ఉంది. కరోనా మూడో ఉద్ధృతి రావచ్చనే ఆందోళన నేపథ్యంలో బంగాల్‌లో ఖాళీగా ఉన్న భవానీపుర్‌ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం ముందుకు రాకపోతే తీరథ్‌ మాదిరి పరిస్థితే ఆమెకు ఎదురు కావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. సెప్టెంబరు 10లోపు తీరథ్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. కరోనా కేసుల కారణంగా మరికొన్ని నెలలపాటు ఉప ఎన్నికలు జరిపే అవకాశం లేనందున కూడా తాను రాజీనామా చేస్తున్నట్లు తీరథ్‌ ప్రకటించారు.

అది అనుమానమే..

కరోనా పరిస్థితుల్లోనూ ఎన్నికలను నిర్వహిస్తుండడం ఈసీ నేరపూరిత నిర్లక్ష్యమని ఇప్పటికే మద్రాస్‌ హైకోర్టు గట్టిగా తలంటింది. అందువల్ల బంగాల్‌లో సమీప భవిష్యత్తులో ఉప ఎన్నిక జరుగుతుందా అనేది అనుమానమే. గతంలో కొందరు మంత్రులు సభలో సభ్యులు కాకుండానే పదవి చేపట్టి, ఆరు నెలలకు కొద్ది రోజుల ముందు రాజీనామా చేసి, మరోసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ఏడాది వరకు నెట్టుకురాగలిగారు. అలాంటిది చెల్లదని సుప్రీంకోర్టు 1995లో నిషేధం విధించింది.

ఇదీ చూడండి:ఉత్తరాఖండ్​ నూతన సీఎంగా పుష్కర్​ సింగ్ ధామీ

Last Updated : Jul 4, 2021, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details