కేంద్ర క్రీడల మంత్రి కిరన్ రిజిజుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయుష్ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తోన్న శ్రీపాద నాయక్ కోలుకునే వరకు కిరెన్.. ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కేంద్ర క్రీడా శాఖ మంత్రికి 'ఆయుష్' బాధ్యతలు - ఆయుష్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు
యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రి కిరెన్ రిజిజుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు తాత్కాలికంగా అప్పగిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
![కేంద్ర క్రీడా శాఖ మంత్రికి 'ఆయుష్' బాధ్యతలు Sports Minister Kiren Rijiju gets additional charge of AYUSH Ministry](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10304644-378-10304644-1611076705268.jpg)
కేంద్ర క్రీడా శాఖ మంత్రికి 'ఆయుష్' బాధ్యతలు
ఈ నెల 12న కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీపాద నాయక్‌కు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన గోవాలో హోమియోపతి చికిత్స తీసుకుంటున్నారు. నాయక్ పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టే వరకు రిజిజుకూ అదనపు బాధ్యతలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు రాష్ట్రపతి.