స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం దాదాపు 30 నిమిషాల పాటు గాల్లోనే తిరిగింది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల అధికారులు ల్యాండ్ అవ్వడానికి అనుమతి ఇవ్వలేదు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం రాత్రి జరిగింది.
ల్యాండింగ్‌కు నో చెప్పిన ఆఫీసర్స్.. అరగంట పాటు గాల్లోనే తిరిగిన విమానం.. చివరకు.. - lalbahadur shastri airport
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని ఓ విమానం 30 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ముంబయి నుంచి వచ్చిన విమానాన్ని ప్రతికూల వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో విమాన ల్యాండింగ్‌కు అనుమతించలేదు అధికారులు.
30 నిమిషాల పాటు గాల్లోనే
స్పైస్‌జెట్ సంస్థకు చెందిన ఎస్జీ 201 విమానం ముంబయి విమానాశ్రయం నుంచి గురువారం రాత్రి 9.45 గంటలకు బయలుదేరి.. వారణాసిలోని విమానాశ్రయానికి చేరుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండ్ చేయడానికి అనుకూల వాతావరణం లేదు. దీంతో అధికారులు విమానం ల్యాండ్ చేయడానికి అనుమతినివ్వలేదు. దీని వల్ల ఆ విమానం దాదాపు 30నిమిషాల పాటు గాలిలోనే తిరుగుతూ ఉంది. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. చేసేదేమీ లేక 10:15 గంటలకు విమానాన్ని తిరిగి ముంబయికి మళ్లించారు. విమానంలో 108 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యానే ల్యాండింగ్‌కు అనుమతినివ్వలేదని చెప్పారు.