తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిమజ్జనం చూస్తున్న వారిపైకి దూసుకెళ్లిన స్కార్పియో - స్కార్పియో గణపతి నిమజ్జనం

వినాయక నిమజ్జనాన్ని వీక్షిస్తున్న వారిపైకి స్కార్పియో దూసుకెళ్లింది. వాహన డ్రైవర్ స్కార్పియోను.. (Scorpio) ఆపకుండా 50 మీటర్లు తీసుకెళ్లాడు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి.

Speeding Scorpio rams 12 people in Jharkhand's Ramgarh
నిమజ్జనం చూస్తున్న వారిపైకి దూసుకెళ్లిన స్కార్పియో

By

Published : Sep 13, 2021, 11:57 AM IST

నిమజ్జనానికి వెళ్తున్న గణపతి విగ్రహాలను చూస్తున్న ప్రజలపైకి ఓ స్కార్పియో (Scorpio) దూసుకెళ్లింది. రహదారి పక్కనే నిల్చొని ఉండగా.. వేగంగా వెళ్తున్న ఈ వాహనం వారిని ఢీకొట్టింది. ఝార్ఖండ్​ రామ్​గఢ్ పట్టణంలోని (Jharkhand's Ramgarh) జెండా చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది.

స్కార్పియో సీసీటీవీ దృశ్యాలు

ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వీరందరినీ ఆస్పత్రికి తరలించారు. స్కార్పియోను గుర్తించిన పోలీసులు.. త్వరలోనే డ్రైవర్​ను అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

ప్రమాదస్థలంలో పోలీసుల బందోబస్తు

ఈడ్చుకెళ్లి...

వీక్షకులను ఢీకొట్టిన స్కార్పియో డ్రైవర్.. 50 మీటర్ల వరకు వారిని ఈడ్చుకెళ్లాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం తర్వాత ఆగేందుకు ప్రయత్నించలేదని వెల్లడించారు.

ఆస్పత్రి ఎదుట బాధితుల బంధువులు

ఈ ఘటన అనంతరం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఫోన్ కోసం అక్కాతమ్ముళ్ల గొడవ- చూస్తుండగానే విషం తాగి...

ABOUT THE AUTHOR

...view details