తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ 75 వేల మంది ఎలా చనిపోయారో? - బిహార్​లో కొవిడ్ మరణాలు

కొవిడ్ రెండో దశ ధాటికి బిహార్​లో మరణాలు అధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో దాదాపు 75 వేల మంది గుర్తుతెలియని కారణాలతో మృతిచెందారు. ఇది ఆ రాష్ట్ర అధికారిక కొవిడ్ మృతుల సంఖ్యతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మృతుల సంఖ్యను తగ్గించి చూపిస్తోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

covid deaths in bihar
బిహార్ కొవిడ్ మరణాలు

By

Published : Jun 20, 2021, 1:33 PM IST

కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ ప్రభావంతో బిహార్‌లో మరణాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో దాదాపు 75 వేల మంది గుర్తుతెలియని కారణాలతో కన్నుమూశారు. ఆ రాష్ట్ర అధికారిక కొవిడ్‌ మృతుల సంఖ్యతో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మృతుల సంఖ్యను తగ్గించి చూపిస్తోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వ సివిల్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం లెక్కల ప్రకారం 2019 జనవరి- మే మధ్యలో 1.3లక్షల మంది కన్నుమూశారు. అదే 2021 జనవరి-మే మధ్యలో 2.2లక్షల మంది మరణించారు. ఆ లెక్క ప్రకారం 82,500 అదనపు మరణాలు చోటు చేసుకొన్నాయి.

ఆ మరణాల పరిస్థితేంటి?

ఈ ఏడాది బిహార్‌లో జనవరి-మే మధ్య కొవిడ్‌ కారణంగా 7,717 మరణాలు సంభవించాయని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో లెక్కల్లో చూపని 3,951 మరణాలను కూడా చేర్చాక ఈ సంఖ్య వచ్చింది. 82,500 అనుమానాస్పద మరణాల్లో నుంచి ప్రభుత్వం చెబుతున్న సంఖ్యను తీసేసినా దాదాపు 74,800పైగా మారణాల పరిస్థితి ఏమిటో తెలియదు. దీనిని బట్టి ఇప్పటికీ ఆ రాష్ట్రం రివైజ్డ్‌ లెక్కలు ఇచ్చినా.. అవి కూడా వాస్తవ పరిస్థితికి దగ్గరగా లేవని అర్థమవుతోంది.

సహజంగా ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య నమోదులో ట్రాక్‌ రికార్డ్‌ మెరుగ్గా లేదు. దీంతోపాటు మధ్య ప్రదేశ్‌, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, దిల్లీలో కలిపి మొత్తం 4.8లక్షల అనుమానాస్పద మరణాలు చోటు చేసుకొన్నట్లు ఓ జాతీయ మీడియా విశ్లేషణలో తేలింది.

ఇదీ చదవండి:'కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం'

ABOUT THE AUTHOR

...view details