తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోనాలి మాండ్లిక్​.. మట్టిలో మాణిక్యం - maharastra young wrestler sonali mandlik

బాక్సర్‌ గీత ఫొగట్‌, జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌లానే ఆకాశాన్ని అందుకోవటానికి నైపుణ్యం గల ఎంతోమంది అమ్మాయిలు కఠోరంగా శ్రమిస్తున్నారు. అహ్మద్‌నగర్‌కు చెందిన సోనాలి మాండ్లిక్‌ కూడా అలానే.. అచంచలమైన పట్టుదలతో ముందడుగు వేస్తోంది.

special story on Maharashtra young wrestler mandlik
సోనాలి మాండ్లిక్​.. మట్టిలో మాణిక్యం

By

Published : Nov 6, 2020, 7:23 AM IST

Updated : Nov 6, 2020, 2:48 PM IST

సోనాలి మాండ్లిక్​.. మట్టిలో మాణిక్యం

ఇది సోనాలి మాండ్లిక్ ఇల్లు. వంట చేస్తోంది ఆమె తల్లి. తండ్రి రైతు. మరి సోనాలి...? అసలు ఎవరు ఈ సోనాలి మాండ్లిక్‌. తనొక కుస్తీ యోధురాలు. మహారాష్ట్ర, అహ్మద్‌నగర్‌ జిల్లా, నాగర్‌ తాలుకా కాపిర్‌వాడి వాసి. ఖేలో ఇండియా పోటీల్లో స్వర్ణపతక విజేత సోనాలి. ఇల్లు రేకుల షెడ్డే అయినా.. లోపలి అల్మారా అంతా తను సాధించిన బహుమతులతోనే నిండి కనిపిస్తుంది. అయినా తన కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వపడేలా చేయాలన్నదే తన లక్ష్యం.

దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నా. అంతర్జాతీయంగా దేశం గర్వ పడేలా చేయాలన్నదే లక్ష్యం. ఒలంపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నా. కానీ నా ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించటం లేదు.

-సోనాలి మాండ్లిక్‌

కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌తో తాత్కాలికంగా తన కుస్తీ సాధన ఆగింది. కానీ ఈ కష్టకాలంలోను తను, ఆమె తండ్రి వెనక డుగు వేయలేదు. దంగల్‌ సినిమాలో అమీర్‌ఖాన్‌లానే సోనాలి తండ్రి ఆమె వెన్నంటి నిలిచారు. అమీర్‌లానే సోనాలి కోసం పొలంలో కుస్తీ గోదా ఏర్పాటు చేశారు. సోనాలి అక్కడే తన సాధన కొనసాగిస్తోంది.

లాక్‌డౌన్‌ వల్ల శిక్షణకేంద్రాలన్నీ మూత పడ్డాయి. అందుకే మా నాన్న పొలంలోనే శిక్షణ ఏర్పాట్లు చేశారు. అక్కడే సాధన చేస్తున్నాను. నిజానికి కుస్తీగోదాలోనే సాధన చేయాలని అనుకున్నా. కానీ లాక్‌డౌన్‌ వల్ల ఇంటి వద్దనే సాధన ప్రాక్టీస్ చేస్తున్నా.

-సోనాలి మాండ్లిక్

ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యంపై దృష్టి చెదరకుండా సాధన కొనసాగిస్తోంది సోనాలి. కిరణ్‌ మోరే పర్యవేక్షణలో ప్రతిభను సానబట్టుకుంటోంది.

ఆమె తండ్రి ఆర్థికపరిస్థితి అంతంతమాత్రమే. తన కుమార్తె అంతర్జాతీయ క్రీడాకారిణి కావాలని అందుకోసం ఏం కావాలన్నా చేస్తనని అయన చెబుతారు. అవసరమైతే ఉన్నకొద్దిపాటి పొలాన్ని అమ్మేస్తా అని అంటుంటారు. కుమార్తెకు మంచి శిక్షణ ఇవ్వాలనే ఎప్పుడూ చెబుతుంటారు.

-కిరణ్‌ మోరే, సోనాలీ కోచ్‌

సోనాలి తన శక్తివంచన లేకుండా కష్టపడుతోంది. ఆమె తండ్రి మద్దతు కూడా అంతే బలంగా ఉంది. ఆర్థికపరమైన ఇబ్బందులే వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.

ఆమె దేశానికి పతకం తేవాలనే నా కోరిక. కానీ తనను ఆ స్థాయికి తీసుకెళ్లడం నా శక్తికి మించిన పని. ప్రభుత్వం సాయం చేస్తే మాత్రం అది సాధ్యమే.

-కొండిబా మాండ్లిక్, సోనాలి తండ్రి

ఇదీ చూడండి: 'ఆఫ్​-రోడ్​​ జీప్​ రేస్​'తో రైడర్లకు పక్కా థ్రిల్​

!

Last Updated : Nov 6, 2020, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details