Special Jury Award: అర చేతిలో వార్తా ప్రపంచాన్ని కళ్ల ముందుంచే ఈటీవీ భారత్‌కు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. 26వ కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో(ఐఎఫ్ఎఫ్కే) రిపోర్టింగ్ విభాగంలో స్పెషల్ జ్యూరీ అవార్డును సొంతం చేసుకుంది. ఐఎఫ్ఎఫ్కేలో ప్రత్యేక చిత్రాలను పరిచయం చేయటం, ప్రేక్షకుల మనోభావాలను ప్రతిబింబించేలా వార్తా కథనాలను ప్రచురించినందుకుగానూ ఈ అవార్డు వరించింది.
కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో.. ఈటీవీ భారత్‌కు అవార్డు - Special Award for ETV Bharat
Special Jury Award: ఈటీవీ భారత్‌ను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. 26వ కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రిపోర్టింగ్ విభాగంలో స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపికైంది.
ఈటీవీ భారత్
త్రివేండ్రంలో నిర్వహించిన ఐఎఫ్ఎఫ్కే ముగింపు కార్యక్రమంలో ఈటీవీ భారత్ తరఫున రిపోర్టర్ బినోయ్ క్రిష్ణన్ ఈ అవార్డును అందుకున్నారు. ఐఎప్ఎఫ్కేలో ఈటీవీ భారత్ అందించిన సహకారాన్ని ఈ అవార్డు గుర్తిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఈటీవీ భారత్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు
Last Updated : Mar 25, 2022, 10:03 PM IST