Tirumala Special Festivals in December : నిత్యం లక్షలాది మంది భక్తులు.. తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఇక్కడకు వస్తుంటారు. అందుకే.. అనునిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)శుభవార్త చెప్పింది. డిసెంబర్ మాసంలో తిరుమలలో నిర్వహించే విశేష ఉత్సవాలను ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ పూర్తి వివరాలను వెల్లడించింది.
తిరుమలలో డిసెంబర్లో నిర్వహించే శ్రీవారి విశేష ఉత్సవాల వివరాలిలా..
- డిసెంబర్ 3న పార్వేట మండపంలో కార్తిక వనభోజన ఉత్సవం జరగనుంది.
- డిసెంబర్ 8న సర్వ ఏకాదశి నిర్వహణ.
- డిసెంబర్ 12న శ్రీవారి అధ్యయనోత్సవాలు ప్రారంభం.
- డిసెంబర్ 17న ధరుర్మాసం మొదలుకానుంది.
- డిసెంబర్ 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్న శాత్తుమొర నిర్వహణ.
- డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం స్టార్ట్ అవుతుంది. ఈరోజు స్వర్ణరథోత్సవం నిర్వహిస్తారు.
- డిసెంబర్ 24న వైకుంఠ ద్వాదశి రోజు శ్రీవారి చక్రస్నానం.. శ్రీ స్వామి పుష్కరిణితీర్థ ముక్కోటి నిర్వహణ.
- డిసెంబరు 28న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు.
ఏడు కొండల మీద కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని.. వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకోవాలని ఎక్కువ మంది భక్తులు తాపత్రయపడుతుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీవారిని తనివితీరా చూడాలని భారీ ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అయితే.. ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనానికి(Vaikunta Ekadashi 2023 Tickets)సంబంధించిన రూ.300 టికెట్లను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసింది. ఆఫ్‌లైన్ టికెట్లను తిరుపతి(Tirupati)లో డిసెంబర్ 22న కౌంటర్ల ద్వారా.. జారీ చేయనుంది.
శ్రీవారి భక్తులకు శుభవార్త - ఫిబ్రవరి టికెట్ల బుకింగ్స్ - ఎప్పుడో తెలుసా?