తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Clash between YSRCP factions: అధికార పార్టీలో రెండువర్గాల అలజడి.. కర్రలు, రాడ్లతో దాడులు.. బెంబేలెత్తిన జనం - Annamaya district ycp leadres news

Clash between YSRCP factions in Rayachoti: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ (వైఎస్సార్సీపీ)కి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇరువర్గాలు దాడులు చేసుకుంటున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

YSRCP factions
YSRCP factions

By

Published : Jun 24, 2023, 5:02 PM IST

Updated : Jun 24, 2023, 7:23 PM IST

Clash between YSRCP factions in Rayachoti: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ (వైఎస్సార్సీపీ)కి చెందిన రెండు వర్గాల నేతలు కర్రలు, రాడ్లతో దాడులు చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది. ఒకరిపై ఒకరు పిడుగుద్దులకు పాల్పడుతూ. .బీభత్సం సృష్టించారు. ఇరువర్గాల నేతలు దాడులు చేసుకుంటున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరికొంతమంది వారిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి హూటహూటిన చేరుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా కూడా అధికారుల మాటలను పట్టించుకోకుండా నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌గా మారాయి.

కర్రలు, రాడ్లతో దాడులు చేసుకున్న వైసీపీ నేతలు

రణరంగంగా మారిన రాయచోటి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో శనివారం రోజువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల నేతల మధ్య ఘర్షణ జరిగింది. తమ స్థలంలోకి ఎందుకొచ్చారంటూ నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ.. బీభత్సం సృష్టించారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. దాడి సమయంలో రోడ్డుపై వెళ్తున్న స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరువర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించిన.. అధికారుల ఎదుటే కొట్టుకున్నారు.

స్థలం వివాదం-కర్రలు, రాడ్లతో బీభత్సం.. గతకొన్ని రోజులుగా రాయచోటి-మదనపల్లె జాతీయ రహదారిపై ఉన్న స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. దీంతో మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి, వైసీపీ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి.. భారీ అనుచరగణంతో వేర్వేరుగా వివాదాస్పద స్థలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఇది కాస్తా.. పెరిగి పెద్దదై పరస్పర ఘర్షణలకు దారితీసింది. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఇరువురు నేతల ముఖ్య అనుచరులు.. కర్రలు, రాడ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. రోడ్డుపై వెళ్తున్న పలువురు స్థానికులు అప్రమత్తమై..వారిని ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల నేతలు మరింతగా రెచ్చిపోయి..ఆవేశంతో దాడులు చేసుకున్నారు.

ఇరువురు భార్యల మధ్య వివాదం.. ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన నలుగురుకి గాయాలయ్యాయని స్థానికులు తెలియజేశారు. హోంగార్డుగా పని చేసి మృతి చెందిన మల్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన స్థలం విషయంలో ఆయన ఇరువురు భార్యల మధ్య గతకొన్ని నెలలుగా వివాదం నడుస్తోందని.. ఈ పంచాయితీలోకి వైఎస్సార్సీపీ నాయకులు చోరబడి.. స్థలాన్ని స్వాధీనపర్చుకునేందుకు యత్నించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిన్న ఇరువర్గాల నేతలు ఆ స్థలం విషయంలో ఒకరిపౌ ఒకరు దాడులు చేసుకున్నారని.. స్థానికులు తెలియజేశారు.

Last Updated : Jun 24, 2023, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details