ఆకాశంలో అద్భుతం.. ఒకే వరుసలో 52 ఉపగ్రహాలు! Starling satellites from earth:ఆకాశంలో అద్భుతం జరిగింది. కర్ణాటకలోని ఉడిపి, మంగళూరు జిల్లాల్లో ఈ వింత కనిపించింది. ఒకే వరుసలో పదుల సంఖ్యలో లైట్లు కనిపించాయి. ఇవన్నీ.. వెలుగులు జిమ్ముతూ వెళ్తూ ఉండటం కనిపించింది. వీటిని చూసి స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
Karnataka starling satellites
అయితే, ఇవేవో గ్రహాంతర వాసులకు సంబంధించినవని అనుకుంటే పొరపడినట్లే. ఇవి స్పేస్ఎక్స్ సంస్థ పంపించిన ఉపగ్రహాలు. శనివారం మొత్తం 52 ఉపగ్రహాలనుస్పేస్ఎక్స్ సంస్థ ప్రయోగించింది. స్టార్‌లింక్ ప్రాజెక్టులో భాగంగా వీటిని అంతరిక్షంలోకి పంపించింది. వీటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టే సమయంలో ఈ అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి.
స్టార్‌లింక్ ప్రాజెక్టులో భాగంగా వేలాది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించనుంది స్పేస్ఎక్స్. అంతర్జాల సేవల కోసం ఈ ప్రాజెక్టు చేపట్టింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని అంగారక ప్రయోగాలకు కోసం వినియోగించనున్నారు.
ఇదీ చదవండి: