తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మమతకు గాయం: కీలక అధికారులపై ఈసీ వేటు

బంగాల్​ సీఎం మమతకు గాయమైన ఘటనకు సంబంధించి ఈసీ చర్యలు చేపట్టింది. పూర్వ మేదినిపుర్​ ఎస్​పీని సస్పెండ్​ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్​, డైరక్టర్​ సెక్యూరిటీని వారి పదవుల నుంచి తొలగించింది.

By

Published : Mar 14, 2021, 7:14 PM IST

sp-of-purba-medinipur-praween-prakash-suspended-following-nandigram-incident-involving-mamata-ec
'మమతకు గాయం' ఘటనలో ఎస్​పీ సస్పెండ్​

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడిన ఘటనపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పూర్వ మేదినిపుర్​ ఎస్​పీ ప్రవీణ్​ ప్రకాశ్​ను సస్పెండ్​ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్​ విభు గోయల్​ను ఆ పదవి నుంచి తప్పించింది. డైరక్టర్​ సెక్యూరిటీ వివేక్​ సహాయ్​ను ఆ బాధ్యతల నుంచి తొలగించింది.

ఘటనపై ఎన్నికల పరిశీలకులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమర్పించిన నివేదికలను పరిశీలించి, ఈ నిర్ణయం తీసుకుంది ఈసీ.

నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే...

ఈ క్రమంలో ఎన్నికల అభ్యర్థులు, స్టార్​ క్యాంపెయినర్ల భద్రత విషయాన్ని ప్రస్తావించింది ఈసీ. అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. వాహనం వినియోగం వంటి సమయాల్లో భద్రతాపరమైన సూచనలను అందరూ పాటించాలని స్పష్టం చేసింది.

ముఖ్యంగా స్టార్​ క్యాంపెయినర్లు భద్రతాపరమైన నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. కేంద్రం అందించిన జెడ్​+ కేటగిరీని తప్పకుండా వినియోగించాలని పేర్కొంది.

ఈ నెల 10న.. నామినేషన్​ కోసం నందిగ్రామ్​ వెళ్లిన మమతా బెనర్జీ.. అక్కడ గాయపడ్డారు. కోల్​కతాలో రెండు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్​ అయ్యారు.

ఇదీ చూడండి:-చక్రాల కుర్చీపై దీదీ ర్యాలీ- తరలివెళ్లిన ప్రజలు

ABOUT THE AUTHOR

...view details