కొత్తగా పెళ్లి చేసుకునే జంటలకు మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తన ఇంట్లో విందు ఇస్తున్నారు. అయితే.. ఆ ఆఫర్‌కు ఆయన ఓ షరతు పెట్టారు. తన కార్యాలయ పరిధిలో కొవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ, గరిష్ఠంగా 10 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలని సూచించారు.
నవ దంపతులకు ఎస్పీ ఇంట్లో విందు ఆఫర్ - bindh
కరోనా కేసులు పెరుగుతోన్న వేళ.. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి వినూత్న ఆలోచన చేశారు ఓ పోలీసు ఉన్నతాధికారి. నూతన వధూవరులకు ఆయన 'డిన్నర్ పార్టీ' ఇస్తున్నారు. అయితే అందుకు పెళ్లి వేడుకలో 10 మందిలోపు అతిథులుండాలని షరతు విధించారు. ఇంతకీ ఈ కథేంటో తెలుసుకోండి.
నవ దంపతులకు ఎస్పీ ఇంట్లో విందు
నిజానికి రాష్ట్రంలో పెళ్లి వేడుకకు గరిష్ఠంగా 50 మందిని మాత్రమే ఆహ్వానించాలి. ఇటీవల కుర్థార్వా అనే గ్రామంలో ఎలాంటి కొవిడ్ నిబంధనలను పాటించకుండా ఓ పెళ్లి వేడుకను నిర్వహించారు. సంగీతానికి తగ్గట్టు పెద్ద సంఖ్యలో యువకులు నృత్యాలు చేస్తున్న ఫొటోలు ఎస్పీ దృష్టికి వచ్చాయి. దీంతో ఆయన 'డిన్నర్ పార్టీ' ఆలోచన చేశారు.
ఇదీ చూడండి:భయం వద్దు: 90శాతం రోగులకు ఇంటివద్దే నయం!