వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు (farm laws repeal) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అయినా ఇటు రైతు సంఘాల నేతల్లో, అటు వివిధ రాజకీయ పార్టీల నాయకుల్లో ఇంకా చర్చ నడుస్తోంది. సాగు చట్టాలను పార్లమెంట్ సాక్షిగా రద్దు చేస్తేనే ఆందోళను విరమిస్తామని రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయిత్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేగాకుండాసంయుక్త కిసాన్ మోర్చా సభ్యులు (Samyukta Kisan Morcha) కూడా ప్రధాని చేసిన ప్రకటనపై నమ్మకం లేక తదుపరి ఆందోళనలు యథాతథంగా జరుగుతాయని ప్రకటించారు. మరికొన్ని డిమాండ్లతో కూడిన ఓ లేఖను మోదీకి పంపుతున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటనపై పలు రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాలను ఎన్నికల (up election 2022) నేపథ్యంలోనే వ్యవసాయ చట్టాలను రద్దు (farm laws repeal) చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పాగా వేసేందుకు మాత్రమే ఎన్డీఎ ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, వామపక్షాలు పేర్కొన్నాయి. 2022లో జరిగే ఎన్నికలు ముగియగానే తిరిగి వ్యవసాయ చట్టాలను (farm laws latest news) ప్రవేశపెట్టే విధంగా భాజపా వ్యూహత్మకంగా అడుగు వేస్తోందని చెప్పుకొచ్చాయి.
"సాగు చట్టాల విషయంలో మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమైంది. రాజ్యాంగబద్ధ పదవులను ఉపయోగించి వచ్చే ఎన్నికలు పూర్తి అయిన తరువాత తిరిగి తీసుకువస్తారు. ఇదే విషయాన్ని సాక్షి మహరాజ్, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా స్వయంగా తెలిపారు.' అని సమాజ్వాదీ పార్టీ పేర్కొంది.
మీ మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరు..
సాగు చట్టాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గతంలో కూడా మోదీ ఇలాంటి మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించారని ఆరోపించారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ రైతు సంఘాలు దిల్లీ సరిహద్దు వీడకపోవడమే ఇందుకు నిదర్శన అని తెలిపారు.
వారి వ్యాఖ్యలతో...