తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా హెలికాప్టర్​కు అనుమతివ్వలేదు..​ భాజపా కుట్రే' - దిల్లీలో చిక్కుకున్న అఖిలేశ్​

SP chief Akhilesh Yadav: తన హెలికాప్టర్​ టెకాఫ్​ అయ్యేందుకు అనుమతించలేదని, దిల్లీలోనే చిక్కుకుపోయానని ట్వీట్​ చేశారు సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​. ముజఫర్​నగర్ ఎన్నికల కార్యక్రమానికి​ వెళ్లేందుకు అనుమతించకపోవటం భాజపా ఉద్దేశపూర్వక కుట్రేనని ఆరోపించారు.

SP chief Akhilesh Yadav
అఖిలేశ్​ యాదవ్

By

Published : Jan 28, 2022, 5:23 PM IST

SP chief Akhilesh Yadav: ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో ఎన్నికల కార్యక్రమానికి వెళ్లేందుకు తన హెలికాప్టర్​ను అనుమతించకపోవటం వల్ల దిల్లీలోనే చిక్కుకుపోయానని ఆరోపించారు సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​. ఈ మేరకు హెలికాప్టర్​తో ఉన్న ఫొటోను ట్విట్టర్​లో షేర్​ చేశారు. అయితే, అందుకు గల కారణాలను వివరించలేదు.

" ఎలాంటి కారణాలు చెప్పకుండానే నా హెలికాప్టర్​ను నిర్బంధించారు. ఇక్కడి నుంచే ఓ భాజపా అగ్రనేత వెళ్లినప్పటికీ.. నేను ముజఫర్​నగర్​ వెళ్లేందుకు అనుమతించటం లేదు. ఇది భాజపా ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రే."

- అఖిలేశ్​ యాదవ్​, ఎస్​పీ అధినేత.

అర్ధగంట తర్వాత మరో ట్వీట్​ ద్వారా భాజపాపై విమర్శలు గుప్పించారు అఖిలేశ్​. 'అధికార దుర్వినియోగం వారి ఓటమిని సూచిస్తోంది. సామాజిక ఉద్యమ చరిత్రలో ఈ రోజు కూడా చేరుతుంది. చరిత్రను మార్చే చారిత్రక పోరాటాన్ని చేయబోతున్నాం.' అని పేర్కొన్నారు.

అఖిలేశ్​ యాదవ్​, ఆర్​ఎల్​డీ అధినేత జయంత్​ చౌధరిలు ముజఫర్​నగర్​లోని పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:ఎస్పీకి ములాయం కుటుంబ సభ్యుల గుడ్​బై- అఖిలేశ్​కే లాభమా?

ABOUT THE AUTHOR

...view details