నైరుతి రుతు పవనాలు(Southwest Monsoon In India) సోమవారంతో.. దేశం నుంచి పూర్తిగా వైదొలిగాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇప్పటివరకు ఆలస్యంగా తిరోగమనం చెందిన నైరుతి రుతుపవనాల్లో(Southwest Monsoon In India) ఇది ఏడవది అని చెప్పింది.
"దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం తగ్గిన నేపథ్యంలో ఈరోజు(2021 అక్టోబరు 25) నైరుతి రుతుపవనాలు దేశాన్ని పూర్తిగా వీడి వెళ్లాయి. 1975 నుంచి 2021 మధ్య కాలంలో దేశంలో ఏడవ అత్యంత ఆలస్యమైన తిరోగమనం ఇదే."
-భారత వాతావరణ శాఖ
అక్టోబరు 25న లేదా ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు దేశాన్ని వీడిన సందర్భాలు 2010 నుంచి 2021 మధ్య ఐదుసార్లు జరిగాయని ఐఎండీ తెలిపింది. 2010, 2016, 2017, 2020, 2021లో ఇలా జరిగిందని చెప్పింది.
సాధారణంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం.. దేశంలో సెప్టెంబరు 17 నుంచి ప్రారంభమవుతుంది. అయితే.. 2020లో సెప్టెంబరు 28, 2019లో అక్టోబరు 9న, 2018లో సెప్టెంబరు 29న, 2017లో సెప్టెంబరు 27న, 2016లో సెప్టెంబరు 15 ప్రారంభమైంది. ఈఏడాది ఈ తిరోగమన ప్రక్రియ రాజస్థాన్లో అక్టోబరు 6న ప్రారంభం కావటం గమనార్హం.
సాధారణ వర్షపాతమే..
నైరుతి రుతుపవనాల కారణంగా(Southwest Monsoon In India) దేశంలో జూన్ నుంచి సెప్టెంబరు మధ్య సాధారణ వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది. వరుసగా సాధారణ వర్షపాతం నమోదు కావడం ఇది మూడో ఏడాది అని చెప్పింది.
జూన్ 3న కేరళ మీదుగా దేశంలోకి నైరుతి రుతుపనాలు ప్రవేశించాయి. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలను తాకాయి.
ఇదీ చూడండి:Rainfall in India: లోటు వర్షపాతం.. ఆగస్టులో కురిసింది అంతంతే!