Moonsoon In Hyderabad : నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నాంపల్లి, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపుల్, హిమాయత్‌నగర్, జీడిమెట్ల, కొంపల్లి, సురారం, షాపూర్‌నగర్, కుత్బుల్లాపూర్, చింతల్, జగద్గిరిగుట్ట, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, అశోక్ నగర్, లోయర్ ట్యాంక్‌బండ్, సరూర్ నగర్, కొత్తపేట్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, దుండిగల్, బహదూర్‌పల్లి, కోఠి, అబిడ్స్, బేగంబజార్, తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు వల్ల రోడ్లపై నీరు నిలిచింది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణశాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.
ఈ జిల్లాలో భారీ వర్షాలు.. కొమురం భీం, మంచిర్యాల,కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు ఆవర్తనము వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాలలోని ఒడిస్సా- పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సగటు సముద్రమట్టానికి 7.6కిలో మీటర్ల వరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి స్థిరంగా కొనసాగుతుందని వివరించారు.