నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు(monsoon) మరింత ముందుకు వచ్చాయని భారత వాతావరణ శాఖ(IMD) గురువారం తెలిపింది. మే 31న కేరళ తీరాన్ని తాకే అవకాశముందని చెప్పింది.
"మాల్దీవులు-కామొరిన్, నైరుతి, తూర్పుమధ్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లో... ఆగ్నేయ బంగాళాఖాతం, పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని కొన్నిప్రాంతాల్లో గురువారం(మే 27) ఉదయం నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు వచ్చాయి. మే 31న ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది."
- ఐఎండీ.