South Western Railway Jobs : రైల్వే ఉద్యోగాలు లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న యువతకు గుడ్ న్యూస్. సౌత్ వెస్ట్రన్ రైల్వే 904 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు RRC SWR అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
డివిజన్లు వారీగా పోస్టుల వివరాలు
Railway ITI Vacancy 2023 :
- హుబ్బళ్ళి - 237
- క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హుబ్బళ్ళి - 217
- బెంగళూరు - 203
- మైసూర్ - 177
- సెంట్రల్ వర్క్‌షాప్, మైసూర్ - 43
విద్యార్హతలు ఏమిటి?
Railway Apprentice Eligibility : అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ లేదా విద్యాసంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఐటీఐ (NCVT/SCVT)లో సంబంధిత ట్రేడ్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి ఎంత ఉండాలి?
Railway Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 15 సంవత్సరాలు, గరిష్ఠంగా 24 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము ఎంత చెల్లించాలి?
Railway Apprentice Application Fee : జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు.