దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ఆనంద్ ఆఫ్ కశ్మీర్‌గా ప్రసిద్ధి. ఇక్కడ పెద్దఎత్తున పాల ఉత్పత్తి జరగడమే ఇందుకు కారణం. అయితే... పాల ఉత్పత్తికి, ఆనంద్ అన్న పేరుకు సంబంధం ఏమిటి?
"ఆనంద్ అనేది మనదేశంలోని ఓ నగరం. అక్కడ భారీఎత్తున పాల ఉత్పత్తి జరిగింది. ఫలితంగా శ్వేత విప్లవం ప్రారంభమైంది."
--తాజాముల్ ఇస్లాం, పాల ఉత్పత్తి కేంద్రం యజమాని
గుజరాత్‌లో ఆనంద్ అనే ఓ జిల్లా ఉంది. ఇక్కడ పాల ఉత్పత్తి భారీగా జరుగుతుంది. అందుకే ఈ జిల్లాకు మిల్క్ సిటీ ఆఫ్ గుజరాత్‌గా పేరొచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఈ జిల్లా ప్రసిద్ధి గాంచింది. ఈ తరహాలోనే పుల్వామా రోజుకు 8.5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తోంది. దక్షిణ కశ్మీర్‌లోని బనిహాల్ నుంచి, ఉత్తర కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఇక్కడ ఓ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఓ సంఘం ఉంటుంది.
"పుల్వామాలో 62 నమోదిత పాల ఉత్పత్తి సంఘాలు ఉంటాయి. అక్కడినుంచే రోజూ పాల సేకరణ జరుగుతుంది."
--డా.అబ్దుల్ రషీద్, అధికారి
ఓ సాంకేతిక పరికరం ఉపయోగించి, పాల నాణ్యత కొలుస్తారు అధికారులు. దాని ఆధారంగా రైతులకు డబ్బు చెల్లిస్తారు. లీటరు పాలకు 25 నుంచి 35, 40 రూపాయల వరకూ ధర పలుకుతుంది.
"మొదట్లో లీటరు పాలు 25 రూపాయలకే అమ్మేవాళ్లం. వెన్నశాతం బట్టి, పాలనాణ్యత కొలుస్తారు. అలా పాలకు ధర నిర్ణయిస్తారు."