హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత. ఈ ప్రత్యేక గ్రంథాన్ని దక్షిణ భారత దేశంలో ముద్రించిన ఏకైక రాష్ట్రం కర్ణాటక. చిక్కమంగళూరు జిల్లా, అజ్జంపురా తాలుకాలోని శివానంద ఆశ్రమంలో ఈ పుస్తకాలు అచ్చయ్యేవి. దేశంలోని నలు మూలలా ఇక్కడ ముద్రితమైన గ్రంథాలే పంపిణీ అయ్యాయి. ఇంతటి ప్రత్యేకతను చాటుకున్న ఈ ఆశ్రమం.. పర్యటక ప్రదేశంగానూ విశేష గుర్తింపు పొందింది.
ఆదరణ పొందిందిలా..
1930లో ఈ ఆశ్రమం ప్రారంభమైంది. అక్కడి శంకరానంద స్వామీజీ కాలంలో హిందువుల పవిత్ర గ్రంథం అచ్చయ్యేది. ఆ స్వామీజీ ఉపన్యాసం వినేందుకు.. దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల భక్తులు తరలివెళ్లేవారట. స్వామీజీ ఆరోగ్యానికి సంబంధించిన మూలికా ఔషధాలు కూడా ఇచ్చేవారట. అలా.. ఆయన ద్వారా మూలికలతో పాటు భగవద్గీతనూ తీసుకునేవారు భక్తులు. అక్కడికి వెళ్లిన వారంతా.. స్వామీజీ ప్రసంగాన్ని విని ఎంతో ఆనందించేవారట.