Sabarimala Special Trains 2023 :శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శబరిమల పుణ్య క్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వెళ్లే వారి కోసం.. ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ శబరిమల(Sabarimala Temple)కు మొత్తం 22 రైళ్లు ఏర్పాటు చేసింది. ఆయా రైళ్లు ప్రయాణించే తేదీలు, టైమింగ్స్, తదితర వివరాలను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది. ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ 22 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్దేశించిన రోజుల్లో రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకెండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
Sabarimala Special Trains Dates and Timings :
సికింద్రాబాద్ - కొల్లాం (07129) :సికింద్రాబాద్లో ఈ నెల 26, డిసెంబర్ 3 తేదీల్లో సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు బయల్దేరి మరుసటి రాత్రి 11గంటల 55 నిమిషాలకు కొల్లాం చేరుకుంటుంది.
కొల్లాం-సికింద్రాబాద్(07130) : కొల్లాంలో ఈ నెల 28, డిసెంబర్ 5 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 8.55 నిమిషాలకు సికింద్రాబాద్ వస్తుంది.
ఈ రైళ్లు ఆగే స్టేషన్లు : నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిసూర్, ,ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్, మావెలికెర స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.
నర్సాపూర్-కొట్టాయం(07119) :ఇది ఈ నెల 26, డిసెంబర్ 3 తేదీల్లో మధ్యాహ్నం 3గంటల 50 నిమిషాలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.50 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.
కొట్టాయం-నర్సాపూర్(07120) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు కొట్టాయంలో ఈ నెల 27, డిసెంబర్ 4 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు రాత్రి 9 గంటలకు నర్సాపూర్ వస్తుంది.
ఈ రైళ్లు ఆగే స్టేషన్లు :భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్ మీదుగా వెళ్తుంది.
శబరిమల వెళ్లే అయ్యప్ప మాలధారులు - ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!
కాచిగూడ-కొల్లం(07123) :ఇది ఈ నెల 22, 29, డిసెంబర్ 6 తేదీల్లో.. సాయంత్రం 5.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.